దానిమ్మలో ప్రాణాంతక బ్యాక్టీరియా మచ్చ వ్యాధి యొక్క సమగ్ర నిర్వహణ
द्वारा प्रकाशित किया गया था Dr. Asha K M पर
దానిమ్మలో ప్రాణాంతక బ్యాక్టీరియా మచ్చ వ్యాధి యొక్క సమగ్ర నిర్వహణ.
దానిమ్మ లో బ్యాక్టీరియా మచ్చ ప్రధాన వ్యాధి, ఇది క్శాంతోమోనాస్ ఆక్సోనోపోడిస్ బ్యాక్టీరియా వలన వ్యాప్తిస్తుంది. దేశం లో దానిమ్మ సాగు రైతులకు దానిమ్మ బ్యాక్టీరియా తెగులు ఒక పెద్ద సమస్యగా మారింది. దానిమ్మ లో బ్యాక్టీరియా తెగులు పండ్ల దాదాపు 90% వరకు దిగుబడిని, నాణ్యత ని తగ్గిస్తుంది మరియు వాటి పండ్ల అమ్మకాల విలువను ప్రభావితం చేస్తుంది.
లక్షణాలు:
ఆకులపై పసుపు వలయాల చుట్టూ గోధుమ రంగు వృత్తాకార మచ్చలు కనిపిస్తాయి, క్రమంగా మచ్చలు నిర్జీవం (నెక్రోటిక్) అవుతుంది మరియు నల్లగా మారుతుంది. తరువాత ప్రభావిత ఆకులు పసుపు రంగులోకి మారి మొక్కల నుండి రాలిపడిపోతాయి.
వ్యాధి పూవులకు కూడా సోకుతుంది, వ్యాధి వ్యాపించడం వల్ల పూతతో పాటు పండు ఏర్పడడం కూడా తగ్గిపోతుంది.
పండ్లు కాసే సమయంలో ఈ వ్యాధి మరింత తీవ్రంగా ఉంటుంది. వ్యాధి పండ్ల పై సంక్రమించినపుడు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి అవి నల్లటి రంగులో కి మారుతాయి., ఇవి తరువాత మచ్చల పరిమాణం పెరుగుతు మొత్తం పండ్ల ఉపరితలాన్ని కప్పి, పండ్ల పగుళ్లు / విభజనకు కారణమవుతాయి. ఇంకా సోకిన పండ్లు కుళ్ళిపోవుటకు దారితీస్తాయి.
ఈ వ్యాధి కొమ్మలు మరియు కాండం వరకు కూడా వ్యాపిస్తుంది, ఇది ప్రభావిత భాగాలను ఎండిపోవుట కి దారితీస్తుంది, తీవ్రమైన పరిస్థితిలో ఇది కొమ్మలు చనిపోవుట కారణమవుతుంది.
వ్యాధి సోకిన 15 రోజుల తరువాత కొమ్మ పసుపు మరియు ఎండి నట్టుగా మారుతుంది. మళ్ళీ 15 రోజుల తరువాత ఇతర కొమ్మలు ఎండిపోవటం మొదలవుతుంది, ఈ విధంగా మొక్క మొత్తం ప్రభావితమవుతుంది.
వ్యాధి సోకిన కొమ్మలు కత్తిరించి చూస్తే, అక్కడ గోధుమ రంగు అచ్చులు కనిస్తాయి. మొక్క చనిపోయే ముందు వాటి ఆకులు పసుపు రంగులోకి మారుతాయి.
కారణాలు:
- వ్యాధి అభివృద్ధికి > 50% సాపేక్ష ఆర్ద్రత(RH) మరియు 25-35°C మధ్య ఉష్ణోగ్రత పరిధి అనుకూలంగా ఉంటాయి.
- దానిమ్మలో బ్యాక్టీరియా మచ్చ వ్యాధి వేగంగా అభివృద్ధి చెందడానికి మేఘావృత వాతావరణ పరిస్థితులతో పాటు వర్షాలు సక్రమంగా కురవకపోవడం చాలా అనుకూలంగా ఉంటాయి.
3. పోషకాల లోపం మొక్కలను బలహీనంగా చేస్తుంది మరియు వ్యాధి అభివృద్ధికి ఎక్కువ అవకాశం కలిగిస్తుంది.
4. ఈ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా గాలి మరియు గాలితో కూడిన వర్షపు జల్లుల ద్వారా వ్యాపిస్తుంది.
5. దానిమ్మ పై మచ్చ కలిగించే బ్యాక్టీరియా మొక్కల కణజాలాలలోకి సహజ ద్వారాలు లేదా గాయాల ద్వారా ప్రవేశిస్తుంది.
6. వ్యాధి సంక్రమణ పండ్లు ఏర్పడు సమయం లో ఎక్కువగా గమనించవచ్చు.
నివారణ చర్యలు:
- నాటడానికి ఆరోగ్యకరమైన మొలకలను మాత్రమే ఎంచుకోవాలి.
- తోట అంత కూడా చాల శుభ్రంగా ఉంచాలి, సోకిన మొక్క భాగాలను తీసేసి కాల్చేయాలి.
- బాగా కుళ్ళిన పశువుల ఎరువులు మరియు వానపాముల (వర్మి కంపోస్ట్) ఎరువులతో పాటు ఎన్:పి:కె ఎరువుల యొక్క తగినంత మరియు సిఫార్సు చేసిన మోతాదును ఉపయోగించాలి, ఇది వ్యాధికి వ్యతిరేకంగా మొక్కల రోగనిరోధకతను పెంచుతుంది.
- వ్యాధి వ్యతిరేక చర్యగా, పరాన్నజీవులు సూడోమోనాస్ ఫ్లోరో సెంస్, బాసిల్లస్ సబ్టిలిస్ బ్యాక్టీరియా మరియు ట్రైకోడెర్మా జాతుల సూక్ష్మ జీవులను వాడడం వలన మచ్చ కు కారణమయ్యే బ్యాక్టీరియా వ్యాపించకుండా అడ్డుపడుతుంది.
సంఖ్య |
సాంకేతిక పేరు |
వాణిజ్య పేరు |
1 |
ట్రైకోడెర్మా |
(ఎకోడెర్మా @ 20 గ్రా / L లేదా సంజీవ్ని @ 20 గ్రా / L లేదా మల్టీప్లెక్స్ నిసర్గా @ 1 ML / లిట్ లేదా బయో-ఫంగైసైడ్ ట్రీట్ @ 20 గ్రా /L లేదా ఆల్డెర్మ్ @ 2-3 ML / L) |
2 |
సూడోమోనాస్ |
(బాక్ట్వైప్ @ 1 1ml / Lit లేదా ఎకోమోనాస్ 20 గ్రా / Lit లేదా స్పాట్ @ 1 1ml / Lit లేదా అల్మోనాస్ @ 2-3 1ml / Lit లేదా బయో-జోడి @ 20 గ్రా / Lit) |
3 |
బాసిల్లస్ జాతి(spp.) |
(మైల్డౌన్ @ 1 ml / Lit లేదా అబాసిల్ @ 2-3 ml / Lit లేదా బయో-జోడి @ 20 గ్రా / లీటర్ నీటికి. |
5. బ్యాక్టీరియా మచ్చ యొక్క తీవ్రమైన విస్తరణ సమయంలో, హస్తా బహర్ పంటను ఎంచుకోండి (సెప్టెంబర్-అక్టోబర్ సమయంలో కత్తిరింపు ద్వారా) మరియు డిసెంబర్ నుండి మే వరకు పంటకు విశ్రాంతి ఇవ్వండి, ఇది వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది.
6. కథేరింపులకు ముందు వ్యాధి తీవ్రతను తగ్గించడానికి 1% బోర్డియక్స్ మిశ్రమంతో పిచికారీ చేయాలి, ఆపై మొక్కలలో ఆకులు రాలిపోవడానికి ఎథ్రెల్ తో పిచికారీ చేయండి. మరియు ఆకులను నాశనం చేయడానికి వాటిని తగలబెటండ
7. కత్తిరింపుల కు పరిశుభ్రం చేసిన పనిముట్లను ఉపయోగించండి.
8. కత్తిరింపుల తరువాత, స్ట్రెప్టోసైక్లిన్ లేదా స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ (5 గ్రాములు) లేదా బాక్టీనాష్ @ 0.5 గ్రా + కాపర్ ఆక్సి క్లోరైడ్ @ 3 గ్రాముల / లి మిశ్రమంతో సోకిన మొక్కల బెరడు లో మిశ్రమాన్ని రాయండి. ఎర్రటి మట్టిని ఉపయోగం మంచిగా పనిచేస్తుంది.
నియంత్రణ:
రసాయన నియంత్రణ మాత్రమే విజయవంతం కానందున రైతులు దానిమ్మలో బ్యాక్టీరియా మచ్చ సమర్థవంతంగా నిర్వహించడానికి నివారణ చర్యలతో పాటు సమగ్ర పద్ధతులను ఎల్లప్పుడూ అనుసరించాలి.
క్రింది కలయికల పిచికారీలు దానిమ్మ బాక్టీరియా మచ్చ వ్యాధిని నివారించడానికి ఉపయోగించవచ్చును.
- వ్యాధి ప్రారంభ దశలో:
బాక్టీనాష్ @ 0.5 గ్రా / లి లేదా స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ @ 0.5 గ్రా / లి (ప్లాంటొమైసిన్ లేదా క్రిస్టోసైక్లిన్) + కాపర్ ఆక్సి క్లోరైడ్ @ 3 గ్రా / లి (బ్లూ కాపర్ ఫంగైసైడ్ లేదా కుప్రినా లేదా బ్లిటాక్స్ లేదా వాల్యూ గోల్డ్) ల తో పిచికారీ చేయండి.
- వ్యాధి యొక్క తీవ్రమైన సంఘటనల సమయంలో:
కాపర్ హైడ్రాక్సైడ్ (కోసైడ్) @ 2.5 గ్రా / లి + బాక్టీనాష్ @ 0.5 గ్రా / లి లేదా స్ట్రెప్టోసైక్లిన్ @ 0.5 గ్రా / లి (ప్లాంటొమైసిన్ లేదా క్రిస్టోసైక్లిన్) ల తో పిచికారీ చేయండి.
గమనిక:
- బక్టీరిసైడ్ యొక్క ప్రతి ఉపయోగం తరువాత మొక్కలను ZnSo4 @ 1gm + MgSo4 @ 1 gm + CaSo4 @ 1gm + Boron @ 1gm + SOP @ 3gm / లీటరు నీటితో కలిపి పిచికారీ చేయండి, ఇది వ్యాధి యొక్క సమర్థవంతమైన నిర్వహణకు సహాయపడుతుంది మరియు మొక్కలలో వ్యాధి నిరోధకతను కూడా పెంచుతుంది.
లేదా
ప్రతి బాక్టీరిసైడ్ ఉపయోగించిన తరువాత జనరల్ లిక్విడ్ మైక్రోన్యూట్రియెంట్ @ 2.5 mL / L + SOP @ 3 gm /L
- దానిమ్మలో బాక్టీరియల్ మచ్చ యొక్క సమర్థవంతమైన నిర్వహణ కోసం, పైన పేర్కొన్న అన్ని సమగ్ర నిర్వహణ విధానాలను మొత్తం దానిమ్మ సాగు చేసే రైతులందురు కూడా పాటించాలి. .
- ట్రైకోడెర్మా హర్జియానమ్ (ఎకోడెర్మా లేదా సంజీవ్ని లేదా మల్టీప్లెక్స్ నిసార్గా లేదా ట్రీట్ బయో-ఫంగైసైడ్ లేదా ఆల్డెర్మ్), సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ (బాక్ట్వైప్ లేదా ఎకోమోనాస్ లేదా స్పాట్ లేదా అల్మోనాస్ లేదా బయో-జోడి) మరియు పేసిలామైసెస్ ఆసిటోమైసిస్, ఆల్మైట్ లేదా నెమటోడ్- లిక్విడ్) నాటే సమయంలో ప్రతి మొక్కకు 50 గ్రాములు అలాగే ప్రతి 6 నెలలు పునరావృతం చేయడం వల్ల బ్యాక్టీరియా మచ్చ తో సహా వివిధ రకాల ఒత్తిళ్లకు వ్యతిరేకంగా ప్రతిఘటన అభివృద్ధి చెందుతుంది.
Created by Dr. ASHA. Agronomist
Translated by Sharmila Reddy
FAS team, BigHaat
***********
మరింత సమాచారం కోసం దయచేసి 8050797979 కు కాల్ చేయండి లేదా 180030002434 కు ఆఫీసు సమయంలో 10 AM నుండి 5 PM వరకు మిస్డ్ కాల్ ఇవ్వండి.
---------------------------------------------------------------------------------------
Disclaimer: The performance of the product (s) is subject to usage as per manufacturer guidelines. Read enclosed leaflet of the product(s) carefully before use. The use of this product(s)/ information is at the discretion of user.
इस पोस्ट को साझा करें
0 टिप्पणी