"మిరప(మిర్చి) పంట సమస్యలు" వేరుల తెగుళ్లు

1 comment

   Chilli fruits

 మిరప(మిర్చి) క్యాప్సికమ్ యాన్యుమ్ ఎల్. పంటని, ఘాటైన పండ్ల కోసం సాగు చేయబడుతుంది. మిరప కాయలను ఆకుపచ్చ మరియు ఎరుపు రంగు(పండు)  కాయలుగా కోస్తారు. ఆకుపచ్చ కాయలను కూరగాయలాగా వాడతారు మరియు పండు మిర్చి కాయలను ఎండ పెట్టి పొడిగా చేసుకొని వాడతారు .  మిరప పంట సోలనేసియస్ కుటుంబానికి చెందినది మరియు మిరప పంట బ్యాక్టీరియా, శిలీంధ్రాలు మరియు ప్రాణాంతక వైరస్‌ల వల్ల కలిగే కొన్ని వ్యాధుల [లీఫ్ కర్ల్ వైరస్/జెమిని వైరస్), టొబాకో మొజాయిక్ వైరస్ మరియు TOSPO(టమోటో స్పాటెడ్ విల్ట్ వైరస్)]కు గురవుతుంది. 

    Chilli diseases

మిరప పంటలో మొక్కల వేరులు వ్యాధుల దాడినుండి మరియు కీటకాల దాడినుండి హానికలగవచ్చు. వేరుల పైన దాడి జరిగి నాశనం అయ్యే సమస్యల గురించి కొన్ని వివరాలు.
 

1. డ్యాంపింగ్ అఫ్ (నానుడు తెగులు)

 డ్యాంపింగ్ అఫ్ తెగుళ్ల ప్రధాన లక్షణం మొలకలు/మొక్కలు/ చెట్లు చనిపోవడం. లేత మొలకలు /నాట్లు వెసిన రెండు నుండి ఐదు రోజులలో జాలేసి చనిపోతాయి మరియు ఎండిపోతాయి, ఈ లక్షణాన్ని నారు కుళ్ళు అని కూడా అని అంటారు.

     Dampinng off in Chilli

వ్యాధి లక్షణాలు  చూడాలంటే భోమిలో వేరులని, మొదళ్ళని హాని చేసె రోగకాణాల వల్ల ఉండొచ్చు లేదా భూమిలో ఎక్కువ తేమ ఉండి మొలకలు బ్రతకడానికి కష్టం అయ్యినప్పుడు డ్యాంపింగ్ అఫ్ ( చనిపోవడం) లక్షణాలు కనుబడుతాయి. 

 

  Dampinng off in Chilli plants

నారు కుళ్ళు వ్యాధితో నాటిన మొక్కలు చనిపోవడం  అరికట్టడానికి  నర్సరీ నుండి మొక్కలు చేనులో నాట్లు వేసిన  2 రోజల లోపల వేరులకి చికిత్స చేయ్యాలసుంటది. 

మెటలాక్సిల్(రిడోమెట్)  35% - 0. 5 గ్రా లేదా నీల్ సియు  0. 5 గ్రా లేదా ఫోసిటైల్ (ఎలియేట్) 3 గ్రా ప్రతి లీటర్ నీటిలో కలిపి వేరులకి చికిత్స ఇవ్వాలి

Damping off control in crops

మోతాదు  ప్రతి మొక్క వేరుకి 50 మిలి పోయేలా చికిత్స చెయ్యాలి. 

 

మిర్చి పంటలో మొక్క చనిపోవడం ఎదిగిన మొక్కలలో కూడా కనుబడుతుంది.

 

2. తేమ వల్ల చనిపోవడం  

మిరప చేను /తోట మట్టిలో వర్షాల వల్ల నీరు/ తేమ ఎక్కువ అయ్యినప్పుడు, మట్టిలో వ్యాధుల జీవులు ఆక్రమించినప్పుడు డ్యాంపింగ్ అఫ్ ( చనిపోవడం)  లక్షణాలు కనుబడుతాయి.

      Root rot in chilli   వేరుకుళ్లు

వేరు కుళ్ళు సమస్య తో నీరు లేదా తేమ ఎక్కువుగా ఉన్నప్పుడు మొక్కలు చనిపోతే, చేనిలో తేమ తగ్గించే చర్యలు తీసుకోవాలి. 

 

3. ఫుసేరియం వేరుకుళ్ళు

తేమ ఎక్కువున్నపుడు  ఫుసేరియం రోగ కణాల దాడివల్ల వేరులు కుళ్లిపోయి మొక్కలు చనిపోతాయి. ఫుసేరియం వేరుకుళ్ళు వ్యాధితో కుళ్ళి పోయిన వేరులు నల్లటి రంగులో కనుబడతాయి. ఈ వ్యాధిని ఫుసేరియం విల్ట్ అని కూడా పిలుస్తారు.

    Fusarium root rot or wilt 

లక్షణాలు ఇలా కనుబడితే కార్బ్యాండేజియం (బావిస్టీన్ లేదా బెంగార్డ్)  శిలింద్ర నాశకాన్ని 2 గ్రామ లేదా నీల్ సియు  0. 5 గ్రామ ప్రతి నీటిలో కలిపి వేరుకుళ్లు ఉన్న చేనిలో వ్యాధి తగిలి చెనిపోయిన మరియు తగలని (ఆరోగ్యాంగా) ఉన్న మొక్కల వేరులకి వేయ్యాలి. 

  Fungicides for Fusarium root rot in chilli

మోతాదు  ప్రతి మొక్క వేరుకి 50 మిలి నుండి 150 మిలి మొక్క వయస్సు మరియు పరిమాణం(సైజు) బట్టి వేరులుకి పోయేలా చికిత్స చెయ్యాలి. 

 

4. ఫ్యటోప్తోర వేరు కుళ్ళు 

ఇటీవల మిరప సాగులో మొక్క మొదుళ్ళు కుళ్లుతో పాటు వేరు కుళ్ళు సమస్యే కనుపడుతుంది. మొక్కలు చెనిపోయినట్లు కనుపడుతాయి, మొక్కల మొదుళ్ళులో తేమ మచ్చలు ఏర్పడి, నల్లగా రంగు మారి, వేరులూ కుళ్ళి పోయి ఉంటది.

 

    Phytoptora root rot

ఫ్యటోప్తోర వేరు కుళ్ళు  వ్యాధి కనుబడిన వెంటనే క్రింద సూచించిన మందుల కలయికను వ్యాధి ఉన్న మొక్కలకి మరియు పక్కను ఉన్న మొక్కలకి  మట్టి లోపల వేరులకి వెళ్లే లాగ చికిత్స చెయ్యాలి

మెలోడీ డ్యూ - 4 గ్రామ లేదా మెటలాక్సిల్(రిడోమెట్)  35% +  0. 5 గ్రా  నీల్ సియు 

 control of phytopthora root rot in chilli

మోతాదు  ప్రతి మొక్క వేరుకి 50 మిలి నుండి 150 మిలి మొక్క వయస్సు మరియు పరిమాణం(సైజు) బట్టి వేరులుకి పోయేలా చికిత్స చెయ్యాలి. 

 

5. నులిపురుగులు దాడి, వేరు పురుగుల దాడి

నులిపురుగులు దాడి, వేరు పురుగుల దాడి వేరులకి ఉన్నపుడు  మొక్కలు చనిపోయే అవకాశాలు ఉంటాయి.

     CHilli plants attacked by Nematodes and root grubs

మిరప మొక్కలు నులిపురుగుల దాడి, వేరు పురుగుల దాడి వల్ల చనిపోయినట్టు ఖచ్చితం అయితే వేరులకి చికిత్స చేస్తే ఆరోగ్యాంగా ఉన్న మొక్కలు, చిన్నగా దాడికి గురిఅయిన   మొక్కల పైన దాడి తగ్గించి చనిపోడాని  అరికట్టవచ్చు .

కార్బొసల్ఫాన్ ( మార్షల్) 3 మిలి లేదా క్వినాల్ఫోస్  (ఏకలక్స్) + వేప నూనె 1 % ( ఇకోనీమ్ ప్లస్) 1 మిలి ప్రతి లీటర్ నీటిలో కలిపి చేనిలో నులిపురుగులు, వేరు పురుగుల దాడితో చనిపోయిన మరియు ఆరోగ్యాంగా ఉన్న మొక్కల వేరులకి వేయ్యాలి.

       Drenching to control nematodes and root grubs

మోతాదు  ప్రతి మొక్క వేరుకి 50 మిలి నుండి 150 మిలి మొక్క వయస్సు మరియు పరిమాణం(సైజు) బట్టి వేరులుకి పోయేలా చికిత్స చెయ్యాలి. 

 

  6. బ్యాక్టీరియా విల్ట్ 

మిరప పంటలో మొక్కలు బ్యాక్టీరియా విల్ట్  మరియు పీతియం విల్ట్  కారణంగా చనిపోయే అవకాశాలు  ఉంటాయి.

మిరప మొక్కలకి బ్యాక్టీరియా విల్ట్ వ్యాధి తగులుంటే వేరులు చూడడానికి ఏ రకమైన కుళ్ళు లేకుండా బాగా చక్కగానే కనబడతాయి , కానీ మొక్కలు మాత్రం చెనిపోయినట్టగా కనుబడుతాయి. బ్యాక్టీరియా విల్ట్ తగిలిన మొక్కలను మట్టినుండి లాగి, వేరులను కడిగి నీటిలో ఉంచితే తెల్లని నురుగు నీటిలోకి రావడాన్ని చూడవచ్చు.

         Bacterial wilt in Chilli

బ్యాక్టీరియా విల్ట్ తెగుళ్ల నిర్వహణకు చేనులో చనిపోయిన మొక్కలకి, చనిపోయిన మొక్కల పక్కన ఉన్న మొక్కలకి చికిత్స ఇవ్వాలి.

కాపర్ హైడ్రాక్సైడ్ ( కోసైడ్)- 2 ప్రతి లీటర్ నీటిలో లేదా నీల్ సియు - 0. 5 ప్రతి లీటర్ నీటిలో లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్ (బ్లైటాక్స్ / బ్లూ కాపర్) 3 ప్రతి లీటర్ నీటిలో + ప్లాంటోమైసిన్ 0. 5 గ్రా ప్రతి లీటర్ నీటిలో లేదా క్రిస్టో సైక్లిన్ 6 గ్రా ప్రతి 40 లీటర్ నీటిలో కలిపి వేరులకి చికిత్స ఇవ్వాలి.

control of Bacterial wilt in Chilli

మోతాదు  ప్రతి మొక్క వేరుకి 50 మిలి నుండి 150 మిలి మొక్క వయస్సు మరియు పరిమాణం(సైజు) బట్టి వేరులుకి పోయేలా చికిత్స చెయ్యాలి.

 

  7. పితియం విల్ట్ 

పితియం విల్ట్ వ్యాధితో మొక్కలు చనిపోవడం ఒక్క మొక్కతో మొదలుపెట్టి, ఓ మొక్క చుట్టూ చెనిపోవడం గమనించవచ్చు. అవి ఒక్కే చోటు లేదా 2 - 3 చోట్లు గుంపు గుంపులుగా చెనిపోయే సమస్య లక్షణాలు కనుబడతాయి.

 Pithium wilt in chilli

ఒక్కసారి పంటలో 50- 500 మొక్కలవరకు పితియం విల్ట్ వ్యాధితో భాదించడం చూడవచ్చు. పితియం శిలింద్రం కలిగించే విల్ట్ వ్యాధి దాడితో మిర్చి మొక్కలు హాని అయ్యుంటే వేరులలో ఏ రకమైన కుళ్ళు ఉండదు, వేరుల పైనకి ఏ సమస్య కలిగనట్టు కనిపిస్తుంది కానీ వేరులను కోసినప్పుడు లోపల కండ కుళ్లిపోయి గోధుమ రంగుగ కనుబడుతుంది.

 పితియం మరియు వెర్టీలిసిల్లీయం విల్ట్ తో బాధపడుతున్న మిరప మొక్కలకి చికిత్స, వ్యాధి వచ్చిన తరువాత ఇచ్చిన ప్రయోజనం లేదు.  
మట్టిలో ఇంతకు ముందు సారి మిరప పంటలో విల్ట్ వ్యాధితోనే  కొంత వరుకు హాని జరిగింది అని కచ్చితంగా ఉంటె 15 రోజులకు ఒక్కసారి వేరులకి క్రింద తెలిపిన మందులతో పితియం విల్ట్ వచ్చున్నా చేనులో విల్ట్ వచ్చియున్న మొక్కల పక్కన మొక్కలకి చికిత్స చేస్తే కొంత వరకు వ్యాధి వ్యాపించడం అరికట్టవచ్చు. 

మెటలాక్సిల్(రిడోమెట్)  35% - 0. 5 గ్రా లేదా నీల్ సియు  0. 5 గ్రా ప్రతి లీటర్ నీటిలో కలిపి వేరులకి చికిత్స ఇవ్వాలి

          Pithium wilt

 

పితియం విల్ట్, వెర్టీలిసిల్లీయం విల్ట్ తగిలిన చేనులో విల్ట్ రోగ కణాలను పోగొట్టి మట్టిని మిరప పంటను పండించడం కోసం తయారు చేయుడానికి కొన్ని చికిత్సలు చేయాల్సుంటది

 • పితియం విల్ట్, వెర్టీలిసిల్లీయం విల్ట్ వ్యాధులు చేనులో ఒక్కసారి వచ్చింది అని కచ్చితం అయితే ఆ చేనిలో కనీసం 1.5 - 2 సంవత్సరాలు మిరప మరియు మిరప స్వజాతి పంటలైన వంగ, టమాటో, ఆలుగడ్డ ( బంగాళా దుంప) , కాప్సికమ్, బజ్జి మిర్చి  పంటలు చెయ్య కూడదు.
 • విల్ట్ వచ్చున్న చేనులో పంట కోత అవ్వగానే  ఏ రకమైన మొక్కలని కానీ చెట్లను కానీ రాలిపోయిన ఆకులు, కాయలు, కొమ్మలు, పళ్లు అన్నిటినీ వదలకుండా ఒక్క చోటు వేసి కాల్చివేయాలి. 
 • వేసవిలో మట్టిని 3 - 4 సార్లు దున్నాలి, ప్రతి సారి దున్నినప్పుడు లోపల మట్టి అంటే విల్ట్ రోగ కణాలు ఎండ తగిలి చనిపోతుంది. వేసవిలో తేమ లేకపోతె నీరు ఇచ్చి దున్నాల్సిఉంటుంది . ఆ మట్టిని దున్నిన వెంటనే ప్రతి సారి ట్రాక్టర్ కల్టివేటర్, ట్రాక్టర్ టైర్, ఎద్దుల కాళ్లు, మడకలు ఏ రకమైన యంత్రాలు వాడిన వేరే పొలం లోకి వెళ్లే ముందు, మంచి నీళ్లతో 2 -3 సార్లు బాగా కడగాలి. దీనితో రోగ కణాలు వేరే పోలంకి వ్యాపించడం జరగదు.
 • ఇలా 3 - 4 సార్లు దున్నిన తరువాత ఆవాల విత్తనాలు వెయ్యాలి. ఆవాల పంట పూత దశకు రాగానే మట్టిలోకి కలిపి దున్నాలి. ఆవాల మొక్కలని కలిపి దున్నినప్పుడు, ఆవాల మొక్కలలోని సారం విల్ట్ రోగ కణాలను నాశనం చేస్తుంది.
 • మిరప జాతి పంటలు వంగ, టమాటో, ఆలుగడ్డ( బంగాళా దుంప), కాప్సికమ్, బజ్జి మిర్చి మరియు మిరప పంటలు పెట్టె ముందు ఇలా చేస్తే విల్ట్ రోగ కణాలను నాశనం చేసి విల్ట్ తెగుళ్ళ దాడిని అరికట్టవచ్చు.
 • అలాగే వంగ, టమాటో, ఆలుగడ్డ( బంగాళా దుంప), కాప్సికమ్, బజ్జి మిర్చి మరియు మిరప పంట వేసే పొలంలో / భూమిలో/మట్టిలో కోసు జాతి (క్యాబేజీ, కాలీఫ్లవర్) పంటలు పండిస్తె కొంత వరకు విల్ట్ తెగుళ్ళని అరికట్టవచ్చు.
 • విల్ట్ వ్యాధి సమస్య ఉన్న పొలానికి మొదటి సంవత్సరం పైన తెలిపిన చికిత్స చేసి, రెండో సంవత్సరంలో మట్టిలోకి విల్ట్ రోగ కణాలను చంపి తినే జీవిలను చేర్చాలి. ట్రైకోడెర్మా హర్జినీయం, విరిడి, బాసిల్లస్ సుబ్టిలిన్, సుడోమోనాస్ ఫ్లోరిసెన్స్ ఇలాంటి జీవులను బాగా కుళ్ళిన పశువుల ఎరువు (ఏ రకమైన విల్ట్ వ్యాధి తగిలిన మొక్కలు వెయ్యని, పశువులు విల్ట్ వ్యాధి తగిలిన మొక్కలని తినుండి కూడదు)తో కలిపి 15 రోజుల వరకు దానికి కొంతగా తేమని ఇస్తూ నీడలో ఉంచాలి.
 • మిరప జాతి పంటలు వంగ, టమాటో, ఆలుగడ్డ( బంగాళా దుంప), కాప్సికమ్, బజ్జి మిర్చి మరియు మిరప పంటలు పెట్టె 15 రోజులు ముందు జీవులు కలిపిన పశువుల ఎరువును మట్టికి చేర్చాలి.
 • విల్ట్ రోగ నిరోధక రకాలు ఎంచుకోని సాగు చేయవచ్చు కానీ విల్ట్ రోగ కారక కణాలు మట్టిలో ఎక్కువుగా ఉన్నప్పుడు ఆ రకాలు విల్ట్ తెగుళ్లతో హాని కావొచ్చు.

                                    &&&

మిరప పంటలో మరియు ఇతర పంటలలో విల్ట్ తెగుళ్ల నిరావణ గురించి మరింత అవగాహన కోసం 8050797979 కి కాల్ చెయ్యండి లేదా 180030002434 కి మిస్డ్ కాల్ఇవ్వండి 

                            *********************

___________________________________________________

Disclaimer: The performance of the product (s) is subject to usage as per manufacturer guidelines. Read enclosed leaflet of the product(s) carefully before use. The use of this product(s)/ information is at the discretion of user.

 


1 comment


 • Ramadasu

  Good


Leave a comment

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.


Explore more

Share this