బొప్పాయి పంటలో పూత రాలడానికి కారణాలు! నివారణ చర్యలు!
బొప్పాయి [కారికా పప్పాయి] చెట్లను అవి ఉత్పత్తి చేసే పువ్వుల ఆధారంగా చెట్లను మగ, ఆడ లేదా హెర్మాఫ్రోడైట్ చెట్లకు వర్గీకరించవచ్చు.
బొప్పాయి చెట్లలో పువ్వులు మరియు పండ్లు బొప్పాయి చెట్టు రకం లేదా లింగాన్ని బట్టి కనిపిస్తాయి అలాగే బొప్పాయి కాయలు లింగాన్ని బట్టి పరిమాణంలో మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు బొప్పాయి చెట్లు అభివృద్ధి దశలలో లింగం ఉష్ణోగ్రతను బట్టి మారవచ్చు.
1. పూత రాలడానికి కారణాలువాతావరణం ఉష్ణోగ్రత మరియు తేమ సాపేక్ష ఆర్ద్రత [RH] : పర్యావరణ ఉష్ణోగ్రత మరియు పర్యావరణ తేమ ముఖ్యంగా పువ్వుల దగ్గర మరియు పువ్వుల చుట్టూ వరుసగా 200C నుండి 330C మరియు 70% నుండి 85% పరిధిలో ఉండాలి. పువ్వుల దగ్గరలో ఉష్ణోగ్రత మరియు తేమ పరిధి కంటే తక్కువ మరియు ఎక్కువ ఉంటె పరాగసంపర్కాన్ని ప్రభావితం చేస్తుంది, పువ్వుల ఫలదీకరణం ప్రక్రియ పైన ప్రభావితం చేసి పూవ్వులు మరియు కాయల పిందెలు రాలిపోవచ్చు.
రైతులు బొప్పాయి చెట్ల పైన రసాయన వృద్ధి నియంత్రకాలు పిచికారీ చేస్తారు అవి కోన్నిసార్లు తక్కువ ఉష్ణోగ్రత ప్రభావాన్ని అధిగమించడంలో సహాయపడతాయి కాని అభివృద్ధి చెందిన పండ్లు విత్తన రహితంగా రావొచ్చు లేదా నాణ్యత లేనిది కావచ్చు.
2. సాగు పద్ధతులు - నత్రజని [N] పోషక చెట్లకి తక్కువ దొరకడం లేదా ఎక్కువ దొరకడం : తక్కువ మరియు అధిక మోతాదులో నత్రజని బొప్పాయి మొక్కలికి అందించినప్పుడు దాని ప్రభావం కూడ బొప్పాయి పంటలో పూలు పడిపోవడానికి కారణం కావచ్చు. బొప్పాయి చెట్లకు కొంచ మోతాదులో అమ్మోనియాకల్ నత్రజని ఇచ్చిన కూడా పూత రావడం మరియు పూలు కాయలుగా మారడం పరోక్ష ప్రభావాన్ని చూపిస్తుంది.
వైరస్ తెగులున్న బొప్పాయి చెట్లకి కొంత అమ్మోనియాకల్ నత్రజని వాడినప్పుడు వైరస్ వ్యాధిని ప్రేరేపిస్తు ఎక్కువ పూత రాలాడినికి కొంత కారణం కావొచ్చు! అధిక మోతాదులో అమ్మోనియాకల్ నత్రజని ఇచ్చున్న బొప్పాయి చెట్లకి మాంగనీస్ లఘు పోషకం పిచికారీ [మాంగనీస్ మైక్రో న్యూట్రియంట్] చేస్తే బొప్పాయి పై వైరస్ వ్యాధిని నిర్వహించవచ్చు.
3. నీరు లేద తేమ: బొప్పాయి పంటకి నీరు అంటే తేమ లేకపోవడం, తేమ తక్కువగా ఇండడం మరియు అధిక తేమ ఉన్నప్పుడు కూడా పంటలో పుష్ప అభివృద్ధి, పరాగసంపర్కం, ఫలదీకరణం మరియు కాయలుగ మారడం పైన ప్రభావితం చేస్తుంది. బొప్పాయి మొక్కలు / చెట్లకు నీటి సరఫరా సరిగ్గా లేక పోతే ఆ ఒత్తిడి కారణంతో పూత రావడం మరియు కాయల సంఖ్యే కూడా ప్రభావితం కావొచ్చు.
4. బొప్పాయి చెట్లు తక్కువ లేదా ఎక్కువ కాంతి వాత వరణంలో పంటలో పుష్ప అభివృద్ధి, పరాగసంపర్కం, ఫలదీకరణం మరియు కాయలుగ మారడం పైన ప్రభావితం చేస్తుంది.
5. బొప్పాయి చెట్లు పూత దశ లో ఉన్నప్పుడు అధిక గాలి చెట్లకి నష్టాన్ని కలిగిస్తుంది మరియు చెట్లలో వచ్చున్న పూతలో పరాగసంపర్కం మరియు ఫలదీకరణం సరిగ్గా అవ్వక పోవచ్చు.
6. బొప్పాయి చెట్లు పూత దశ లో పూత పైన, కాయల పైన కలిగే కీటకాల దాడి పూల ఆరోగ్యం పైన ప్రభావితం చేస్తుంది.
7.బొప్పాయి చెట్లు ఆకుల పైన కలిగే వ్యాధులు బూడిద తెగులు, బూజు తెగులు (డౌనీ), నల్ల మచ్చ (బ్లాక్ స్పాట్) వంటి శిలింద్ర వ్యాధులు; బాక్టీరియా మచ్చలు(బాక్టీరియల్ స్పాట్) మరియు బొప్పాయి రింగ్ స్పాట్ వైరస్, ఆకు ముడుత వైరస్ వ్యాదుల కారణంగా బొప్పాయి పంటలో పూత రాలడం ఎక్కువుగా ఉంటది.
8.బొప్పాయి పంటకి పోషకాల లోపం - ముఖ్యంగా బోరాన్ మరియు కాల్షియం వంటి సూక్ష్మపోషకాల సరైన మోతాదులో దొరక్కపోతే బొప్పాయి పంటలో పూత రాలడం రాలడం ఎక్కువుగానే ఉంటది.
బొప్పాయి పంట ఇసుక మట్టి మరియు తేలికపాటి మట్టి రకం మట్టిలలో సాగు చేసినప్పుడు పోషకాలు లోపం కనుపడుతుంది.
బొప్పాయి పంటలో కొన్ని చర్యల పాటిస్తే , బొప్పాయి పంటలో పూత రాలడం తగ్గించడమే కాకుండా ఎక్కువ ఆరోగ్యవంతమైన పూత పట్టేలా చేయవచ్చు. సరైన సమతుల్య పోషక నిర్వహణ బొప్పాయి పంటలో మంచి పుష్ప ఆరోగ్యాన్ని మరియు మంచి కాయలను పొందడానికి సహాయపడుతుంది.
బొప్పాయి పంటలో మట్టి మరియు వాతావరణంలో తేమ, వెలుగు బాగా తగినంతగ అందించండి ; వ్యాధులను [బూడిద తెగులు, బూజు తెగులు (డౌనీ), నల్ల మచ్చ (బ్లాక్ స్పాట్), బాక్టీరియా మచ్చలు(బాక్టీరియల్ స్పాట్), బొప్పాయి రింగ్ స్పాట్ వైరస్, ఆకు ముడుత వైరస్ వ్యాధులు .. ] దూరంగా ఉంచడానికి క్రింది ఇచ్చిన కలయికలను 7 - 10 రోజులికి ఒక్క సారి పిచికారీ చెయ్యండి.
కలయిక 1
బ్లిటాక్స్ 2 గ్రా / లీ + ప్లాంటొమైసిన్ 0.5 గ్రా / లీ + మాగ్నమ్ ఎంఎన్ 0.5 గ్రా / లీ + వి జైమ్ - 2 మిలీ / లీ
కలయిక 2
రిడోమెట్ 0.5 గ్రా / లీ + కాన్ఫిడార్ 0.5 మిలీ / లీ + బోరాన్ 20% 1 గ్రా / లీ + ఎకోనీమ్ ప్లస్ 1% -1 మిలీ / లీ
కలయిక 3
అవతార్ 2 గ్రా / లీ + అనంత్ 0.5 గ్రా / లీ + అహార్ 2 మిలీ / లీ + ఎకోనీమ్ ప్లస్ 1% -1 మిలీ / లీ
పూత రాలడం లేదా పూత కూలిపోవడం నియంత్రణ కోసం పైన స్ప్రేలు పిచికారీ చేయవచ్చు. తామర పురుగులు (త్రిప్స్), అఫిడ్స్ వంటి పీల్చే కీటకాలను నియంత్రిస్తాయి; వ్యాధులుని నియంత్రణతో మెరుగైన పుష్ప దీక్ష మరియు పింద కాయల ఆరోగ్యం కోసం కొన్ని ముఖ్యమైన పోషకాలను కూడా అందు ఈ పిచికారీ కలయికలు అందిస్తాయి.
*************
మరింత సమాచారం కోసం దయచేసి 8050797979 కు కాల్ చేయండి [10 AM నుండి 5 PM] లేదా 180030002434 కు మిస్డ్ కాల్ ఇవ్వండి
_________________________________________________________
Disclaimer: The performance of the product (s) is subject to usage as per manufacturer guidelines. Read enclosed leaflet of the product(s) carefully before use. The use of this product(s)/ information is at the discretion of user.
Leave a comment