Free Delivery on Orders Above Rs. 499/- | Use CODE : KHARIF3 to get 3% OFF on Minimum purchase of ₹4999/- | Use CODE : KHARIF5 to get 5% OFF on Minimum purchase of ₹14999/- T&C Apply | Use Code “Sarpan" & get 10% off on All Sarpan Seeds on Purchase Above Rs. 1000/-

Menu
0

డ్యాంపింగ్ ఆఫ్ (మొక్కలు చనిపోవడం) వ్యాధి - కారణాలు - నిర్వహణ

Posted by kummathi Amrutha on

డ్యాంపింగ్ ఆఫ్(మొక్కలు చనిపోవడం) వ్యాధి వలన వివిధ పంటలలో మొలకెత్తిన మొక్కలు లేదా పెద్ద మొక్కలు చనిపోవడం గమనించవచ్చు.శీలింద్రాలు(పీథియం విల్ట్ ,ఫుసేరియం విల్ట్,వెర్టిసిల్లీయం విల్ట్,రైజోక్టోనియ ),బాక్టీరియా(సుడోమోనాస్ బ్యాక్టీరియల్ విల్ట్,క్సన్తోమోనాస్ విల్ట్),నెమటోడ్(మెలొడోగైనె spp.,) మరియు కీటకాల(వేరు పురుగు,లద్దె పురుగు,చెదలు) దాడి వలన ఇలా వివిధ కారణాల వల్ల మొక్కలు చనిపోవడం జరుగుతుంది.డ్యాంపింగ్ ఆఫ్(మొక్కలు చనిపోవడం)వ్యాధి శిలీంద్రల వలన చాల ఎక్కువగా ఆశించే వ్యాధి.ఈ వ్యాధి సాధారణంగా టమాట,మిర్చి,బంగాళా దుంప,వంకాయ,కాప్సికం,బంతి పూలు,చేమంతి,క్యాబేజి,కాలీఫ్లవర్,క్నోల్ ఖోల్,ఉల్లి,అల్లము,పసుపు,గులాబీ,దానిమ్మ,జామ,జొన్న,వేరు శెనగ,పత్తి,కందులు, పెసర,మినమలు,బొప్పాయి పంటలలో నారు మడి(నర్సరీ)/మొలకల దశ/వృద్ధి దశ/ పిలక దశ/పూత దశలలో ఆశించవచ్చు.

డ్యాంపింగ్ ఆఫ్ (మొక్కలు చనిపోవడం) వ్యాధి యొక్క కారణ జీవి:
క్రింద సూచించిన కారణ జీవుల వల్ల డ్యాంపింగ్ ఆఫ్ వ్యాధి  (మొక్కలు చనిపోవడం) వ్యాపిస్తుంది.



వ్యాధి యొక్క
 లక్షణాలు
డ్యాంపింగ్ ఆఫ్(మొక్కలు చనిపోవడం) కారణ జీవి అనేది లేత మొక్కల్లో మరియు ముదురిన మొక్కల్లో వేరు కుళ్ళు (రూట్ రాట్)లేదా మొదలు కుళ్ళుకు (కాలర్ రాట్ )కారణమవుతుంది.



వేరు  కుళ్ళు (రూట్ రాట్):

తెగులు వేర్లకు వ్యాపిస్తే, వేర్లు కనబడవు . ఒకవేళ ఉన్నప్పటికీ, కుళ్లిపోయి వాటి మీద నల్లటి మచ్చలు కనిపిస్తాయి.Fig(1)

                                Fig(1)

భూమి లోపల విత్తనాలు మొలకెత్తినప్పటికీ, మొలకలు భూమి పైకి రావు. సాధారణంగా ఈ పరిస్థితిని ప్రారంభ దశ డ్యాంపింగ్-ఆఫ్‌గా పేర్కొంటారు. తర్వాత దశలో డ్యాంపింగ్ ఆఫ్ సోకినప్పుడు మొలకెత్తిన మొక్కలు ఎండిపోతాయి లేదా ఆకస్మికంగా చనిపోతాయి.Fig(2)

                                          Fig(2)

ఈ తెగులు కారణంగా కొన్నిసార్లు మొక్క పైభాగం ఆరోగ్యంగా కనిపించినప్పటికీ, కొద్ది రోజుల్లోనే మొక్కలు వాలిపోయి, వాడిపోతాయి.

కాండం కుళ్ళు (కాలర్ రాట్ ):

మొలకెత్తిన మొక్కలు అసాధారణ పరిమాణంలోని ఆకులతో మరియు వాటి మీద నానినట్టుగా ఉండే మచ్చలతో ఎదుగుదల లోపించి ఉంటాయి. కాండం మెత్తగా మరియు బలహీనంగా ఉంటుంది.Fig(3)


                                       Fig(3)

కొన్ని పంటలలో  లేత మొక్కలు వాడిపోతాయి, పచ్చ రంగు నుండి బూడిదరంగులోకి, చివరకు నల్లగా మారి చనిపోతాయి.Fig(4)

                                       Fig(4)

మొలకలు ఈ తెగులకు గురైతే, కాండం నల్లగా మరియు ఎండిపోయినట్టుగా మారిపోయి, తీగ కాండం (వైర్ స్టెమ్) లాగా కనిపిస్తుంది.Fig(5)

                                        Fig(5)

తేమ అధికంగా ఉండే బుతువులో  రసయుతమైన సాలీడు గూడు లాగా ఉండే శిలీంధ్రం అనేది తెగులు సోకిన ప్రదేశంలో మరియు దాని సమీపంలో పెరుగుతుంది.Fig(6)

                                       Fig(6)

      డ్యాంపింగ్ ఆఫ్ సమస్యకు కారణాలు

  • పొలాన్ని సరైన విధంగా తయారు చేయకపోవడం వల్ల నారుమడి లేదా మట్టిలో తెగులు-కారక హానికర జీవులు వృద్ది చెందుతాయి.
  • అందువలన,వ్యాధిని  కలిగించే హానికారక జీవులు దాడి చేయడానికి తగిన పరిస్థితులు ఉన్నప్పుడు ఈ వ్యాధి తీవ్రమవుతుంది
  • పొలంలో అధిక మోతాదులో ఎరువులు వేయడం వలన మరియు  నారుమడిలో అవసరమైన దానికంటే ఎక్కువ తేమ ఉండడం వల్ల కూడా ఈ వ్యాధి ఆశించవచ్చు
  • తక్కువ నాణ్యత కలిగిన విత్తనాలు, అవసరమైన మేరకు శుద్ధి చేయకపోవడం  వల్ల వ్యాధి  సోకే అవకాశాలు ఎక్కువ.
  • కలుషితమైన ఉపకరణాలతో కలుపు తీయడం, నారుమడి మరియు పొలంలో అంతర కృషి కోసం మరల కలుషితమైన ఉపకరణాలు ఉపయోగించడం ద్వారా డ్యాంపింగ్ ఆఫ్ వ్యాధి వ్యాపించవచ్చు.
  • మొలకెత్తడం కోసం విత్తనాలను నిల్వచేసే పద్ధతి సరిగా లేకపోవడం.
  • నారుమడిలో(నర్సరీ)సరైన రీతిలో కలుపు నివారణ చేపట్టకపోవడం వల్ల హానికారక జీవుల సంఖ్య పెరిగి చివరకు డ్యాంపింగ్ ఆఫ్ దారితీస్తుంది.

      నివారణ చర్యలు:


  • తెగులు సోకిన మొక్కల భాగాలను తీసి దూరంగా పారివేయండి లేదా కాల్చి వేయాలి.
  • పొలంలో  మొక్కల వద్ద నీటి నిలువ లేకుండా ఉండేలా చూసుకోవాలి.
  • పంట మార్పిడిని  అనుసరించాలి .
  • సరైన అంతరాన్ని నిర్వహించాలి. 

డ్యాంపింగ్ ఆఫ్ జీవ నియంత్రణ(బయోలాజికల్ కంట్రోల్):


5 నుంచి 6 టన్నుల పశువుల ఎరువుతో  ట్రైకోడెర్మా విరిడే - 2 కిలోలు, సూడోమోనాస్ ఫ్లూరోసెన్స్- 2 కిలోలు మరియు అజోస్పిరిల్లమ్ - 5 కిలోలు  కలిపి 5 రోజుల పాటు చెట్టు నీడలో ఉంచి,తర్వాత  పొలానికి వేసి ఆపై భూమిని దున్నాలి.

రసాయన నియంత్రణ(కెమికల్ కంట్రోల్):


పెద్ద మొక్కలలో నీల్-Cu- 1గ్రా (లేదా) మెటాలాక్సిల్ 35%- 0.75- 1గ్రా ప్రతి లీటర్ నీటిలో కలిపి మొదల్ల వద్ద తడపాలి (డ్రెంచింగ్ చేయాలి).

మొలక దశలో డ్రెంచింగ్  చేయడానికి వీలుకానపుడు  నీల్-Cu- 1గ్రా (లేదా) మెటాలాక్సిల్ 35%- 0.75- 1గ్రా ఇసుకకు అంటుకునే విధంగా  కలిపి పొలంలో చల్లాలి, దీనివలన చిన్న మొక్కలు చనిపోవడం నిర్వహించవచ్చు.

Created By: 

Kummathi shri Amrutha
SME-Fasteam
BigHaat. 

++++++++++++++++++++++++++++++++++++++

For more information kindly call on 8050797979 or give missed call on 180030002434 during office hours 10 AM to 5 PM

------------------------------------------------------------------------

 Disclaimer: The performance of the product (s) is subject to usage as per manufacturer guidelines. Read enclosed leaflet of the product(s) carefully before use. The use of this product(s)/ information is at the discretion of user.

 


Share this post



← Older Post Newer Post →


Leave a comment