మిర్చి పంటలో వైరస్ వ్యాధుల నిర్వహణ

6 comments

    మిర్చి

మిర్చి  [క్యాప్సికమ్ యాన్యుమ్ ఎల్]. పంటని  పండ్ల కోసం ప్రపంచవ్యాప్తంగా పండిస్తారు. మిర్చి  పంటను పచ్చ కాయలు మరియు ఎరుపు పండ్లను రెండు రకాలుగా వాడుతారు. పంట సాగులో మిర్చి మొక్కలని కొన్ని వ్యాధులు మరియు కీటకాలు బాధిస్తాయి. మిర్చి పంటని అతిగా నష్ట పరిచే వ్యాదులైతే వైరస్ వ్యాధులు. మిర్చి మొక్క ప్రముఖంగా లీఫ్ కర్ల్ వైరస్ [జెమిని వైరస్], పొగాకు మొజాయిక్ వైరస్ (టొబాకో మొజాయిక్ వైరస్) మరియు టోస్పో [టమోటా మచ్చల విల్ట్ వైరస్] వంటి ఘోరమైన వైరల్ వ్యాధులకు గురవుతుంది. 

   మిర్చి వైరస్ వ్యాధులు

లీఫ్ కర్ల్ వైరస్ [జెమిని వైరస్] Leaf curl virus or Gemini Virus

ఈ వైరస్ రోగాన్ని బొబ్బర అని, గుబ్బ, గజ్జి ఆకు ముడుత,ఆకు ముడుత అని అనేక పేర్లతో పిలుస్తారు. దీని యొక్క లక్షణాలు కూడా వివిధ రకాలుగా కనిపిస్తాయి , మిర్చి మొక్కలు గిడసబారి పొట్టిగా ఉంటాయి, పెరిగే ఆకులు పైనకి ముడుచుకొని  ఉంటాయి, ఆకుల ఈనెలు ముదురు పచ్చ రంగుతో ఈనెల మధ్య భాగం లేత పచ్చ రంగుతో కూడి ఉంటాయి. ఆకులలో బొబ్బలు కనిపిస్తాయి. మిర్చి కాయల్లో పెరుగుదల తక్కువ ఉంటుంది మరియు ఆకారం కోల్పోతాయి.

  మిర్చి పంటలో జెమినీ వైరస్ వ్యాధి

పొగాకు మొజాయిక్ వైరస్ (టొబాకో మొజాయిక్ వైరస్) Tobacco mosaic virus

పొగాకు మొజాయిక్ వైరస్ (టొబాకో మొజాయిక్ వైరస్) - ఆకులు లేత పచ్చ మరియు ముదురు పచ్చ రంగు రెండు రంగులతో కూడిన ఆకారం లేకపోగా చాల పలచగా మారిపోవడం. ఆకుల ఈనెలు ముదురు పచ్చ రంగుతో ఈనెల మధ్య భాగం లేత పచ్చ రంగుతో కూడి ఉంటాయి.

  మిర్చి పంటలో పొగాకు వైరస్ వ్యాధి

టోస్పో [టమోటా మచ్చల విల్ట్ వైరస్]

మిర్చి మరియు ఇతర పంటలని ఎక్కువుగా బాధించే వైరస్ వ్యాధి అంటే బడ్ నెక్రోసిస్ [ ఆకుల మీద రవి రంగు వలయకార మచ్చలు  కనిపించి మొత్తానికి ఆకులు రాలి పోతాయి, రోగం కాండానికి సోకి మొక్కల కొసలు ఎండిపోవడం] ఈ వైరస్ వ్యాధి టమోట పంటని కూడా దాడి  చేస్తుంది మరియు దీనిని టమాటో స్పాట్టెడ్ విల్ట్ వైరస్ [టాస్పో] అని కూడ పిలుస్తారు.

 మిర్చి పంటలో తొస్పో వైరస్ వ్యాధి

మిర్చి పంటలో వైరస్ వ్యాధుల నిర్వహణ

వైరల్ వ్యాధులు  మొలకల 25 రోజుల వయస్సు కంటే ముందు పెరుగుతున్న దశలలో మొక్క నుండి మొక్క వరకు వ్యాప్తి చెందుతాయి మరియు ఈ ప్రత్యేక దశ వైరస్ ఎక్కువుగా వ్యాప్తిచెందడానికి అనుకూలం. మొలకల దశలో వైరస్ తాకితే నాటు చేసిన తరువాత కనబడే అవకాశాలు ఎక్కువ. వైరస్ వ్యాప్తించడానికి రసం పీల్చే పురుగులు తెల్ల దోమ, తామర పురుగులు, పెను బంక ఇలాంటి కీటకాలు.

 మిర్చి పంట రసం పీల్చే కీటకాలు

మొలకల దశలో  మొక్కలు చాల సున్నితంగా ఉంటాయి కాబట్టి ఈ కీటకాల దాడి ఎక్కువుగా ఉంటది, ఈ కీటకాలు దాడి చేసి, రసం పీల్చిడంతో పాటు వైరస్ వ్యాధులను మొక్క దశలోని వ్యాపిస్తాయి.

 మొక్కల నర్సరీ

అందుకని మొక్కలుని ఈ కీటకాలునుండి మొలకల దశలో రక్షించినట్లైతే, వైరస్ తెగులునుండి మిర్చి పంటని వైరస్ వ్యాదులు భాదించుకుండా అరికట్టవచ్చు.

 మొక్కలను నర్సరీ లో పెంచడం

మొక్కలని నర్సరీలో పెంచితే  రసం పీల్చే పురుగులు నుండి దాడి అవ్వకుండ పెరుగుతూ, వైరస్ వ్యాదులనుండి రక్షించబడతాయి. మొక్కలు మార్పిడి నాటు చేసిన తరువాతకూడా పొలంలో వైరస్ వ్యాధులు అంతగా బాధించవు.

ఈ పైన చూసిన వైరస్ వ్యాదులిని నియంత్రించడానికి రైతులు, ఔషధ మూలీకలతో తయారు చేసిన మందులను వైరస్ తెగులున్న పంటల ఆకుల పైన పిచికారీ చేయవచ్చు.

వైరస్ వ్యాధుల నివారణ సహజ మందులు బిగ్ హాట్ లో లభించును

పెర్ఫెక్ట్ , [PERFEKT]

    పెర్ఫెక్ట్ [PERFEKT]

వైరల్ అవుట్, [VIRAL OUT]

    వైరల్ అవుట్, [VIRAL OUT]

వి - బైండ్, [V-BIND]

      వి - బైండ్
నో వైరస్, [NO VIRUS]

      నో వైరస్
దనవంత్రి [DANAVANTHRI]

      దనవంత్రి [DANAVANTHRI]

సహజ మందులుతో పాటు మ్యాంగనీస్ సూక్ష్మ పోషకాలు మిశ్రమం తో   చేస్తే వైరస్ వ్యాధుల నివారణ ఎక్కువ ప్రభావంతగా అవుతుంది.

మ్యాంగనీస్ సూక్ష్మ పోషక ఉన్న ఉత్పత్తులు.

మ్యాగ్నమ్ ఎం ఎన్ , [ MAGNUM Mn]

    మ్యాగ్నమ్ ఎం ఎన్
సీమ్యాన్, [SEAMAN]

     సీమ్యాన్
న్యానో ఎం ఎన్ [NANO Mn]

      న్యానో ఎం ఎన్

ఈ మందు వాడిన తరువాత వైరస్ తెగుళ్లతో బాధ పడుతున్న మొక్కుల్లో వైరస్ ఎక్కువ అవడం అరికట్టడంతో పాటు రోగ లక్షణాలు తగ్గిపోతాయి.

వైరస్ తెగుళ్ల వల్ల వచ్చే పూత రాలడం, కాయ అవ్వక పోవడం, ఆకులు కాలిపోవడం, రాలిపోవడం మరియు ఇతర వైరస్ రోగ లక్షణాలు ఆగి పోయి మొక్కలలో కొత్త పెరుగుదల కనిపిస్తుంది.

 

గమనిక:
మిర్చి పంట వైరస్ వ్యాధుల నివారణకు సిఫారసు చేసిన సహజ మందుల ఉపయోగం ఇతర పంటలైన బీరకాయ, కాకర, సొర కాయ, టమాటో, బొప్పాయి, క్యాప్సికమ్లను భాదించే వైరస్ వ్యాధుల నిరవహించడానికి చేయచ్చు .

                             *********

Acknowledgements:

Language assistance - Sreelatha.

Images courtesy - GOOGLE

 

K SANJEEVA REDDY,

Senior Agronomist, BigHaat.

__________________________________________________

Disclaimer: The performance of the product (s) is subject to usage as per manufacturer guidelines. Read enclosed leaflet of the product(s) carefully before use. The use of this product(s)/ information is at the discretion of user.


6 comments


 • Vasu Yadla

  What should be done in the pepper there is a blob here and there.


 • Anil Achhale

  Sir


 • Chelikani Ganesh

  Mirchi lo ippude bobbara vasthundi


 • Tanti Mehul

  My coll mi mo no 9909891933


 • Devender Reddy

  Chili lo gimene viresh


Leave a comment

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.


Explore more

Share this