Use Code “RABI3" & get 3% Discount on Orders Above Rs. 4999/-    |     Use Code “RABI5" & get 5% Discount on Orders Above Rs. 14999/-    |     Free Delivery on Orders Above Rs. 1199/-    |     Deliveries may take longer than normal due to Lockdown    |    LIMITED PERIOD OFFER: Get 10% off on all Sarpan Seeds   |     BUY 5 GET 1 FREE ON SHAMROCK AGRI PRODUCTS

    |     
Menu
0

మామిడి పంటలో లీఫ్ హోపర్ సమర్థవంతమైన నియంత్రణ నిర్వహణ

Posted by Dr. Asha K M on

భారత దేశం లో మామిడి పండించే అన్ని ప్రముఖ ప్రాంతాల్లో లీఫ్ హోపర్ ఒక తీవ్రమైన సమస్య. దీని తీవ్రత వాళ్ళ మొక్క దెబ్బతింటుంది, పిందె శాతం తగ్గి మరియు పిందె రాలుట సమస్య తీవ్రమవుతుంది. దీని వల్ల పంటలో 60 శాతం  లేదా అంతకన్నా ఎక్కువ పంట నష్టం జరుగుతుంది. అందుమూలన మామిడి పంటలోఈ పురుగును జాగ్రత్తగా మరియు సమర్ధవంతగా ఎదురుకోవాల్సి ఉంటుంది.

 

లక్షణాలు

ఈ పురుగులు ముఖ్యంగా  గుంపుగా  దాడిచేస్తాయి.పూత మరియు లేత ఆకుల చిగుర్ల మీద దాడి చేసి వాటిలో ఉన్న రసాని  పీలుస్తాయి  దీనివల్ల పూత  ఎండిపోయి గోధుమ రంగులోకి మారుతాయి .ఈ పరిస్థితి , పిందెకాయ  అవ్వకపోవడం,తక్కువ దిగుబడి  మరియు పంట నష్టానికి దారితీస్తుంది.

 

 

ప్లాంట్ హాప్పర్లు ఆహారం తీసుకునే  క్రమం లో  ఆకుల మీద  జిగురుపాటి ద్రవాన్ని విసర్జిస్తాయి న్ని"హనీడ్యూ" అంటారు. ఇవి ఆకుల మీద నల్లని సూదిపతి శిలీంధ్రాలు గా  పేరుకుంటాయి దీని వల్ల మొక్కలో కిరణజన్య సంయోగక్రియ తగ్గి మొక్క అభివృద్ధి చెందదు.

 

కారణాలు:

1. పెద్ద కీటకాలు చెట్టు బెరడులో నివసిస్తూ ఏడాది పొడుగునా వృద్ధి చెందుతాయి, అందులోనూ ఫిబ్రవరి మరియు మార్చ్ నెలల్లో పూత మరియు ఆకూ చిగురించే సమయం లో వృద్ధి శాతం మరింత పెరుగుతుంది

 

2. మామిడి పంటలో ప్లాంట్ హాప్పర్లు విభజనకు తేమ మరియు నీడ ప్రదేశాలు అనుకూలమైనవి.

 

3. వాటి జాతి ఆధారంగా  పూత మరియు ఆకూ ఛిగ్గులు మీద గుడ్లు పెట్టి  సుమారుగా రెండు నుండి మూడు తరాలు నివసిస్తాయి

 

4. సరిగా శుభ్రం నిర్వహించని తోటలు మరియు మొక్కలు దగ్గరగా నాటడం వల్ల ఈ పురుగులు బాగా వృద్ధి చెందడానికి కారణం అవుతాయి.

 

5. నీటి పారుదల సరిగా లేని భూములు వీటి ఆకస్మితా వ్యాప్తి కి కారణముఅవుతాయి

 

నివారణ చర్యలు:

1. మొక్కలు మధ్య  సరిపడా అంతరం పాటించాలి మరియు కావలిసిన  సూర్యరశ్మి తగిలేలా తోట నర్వహించాలి

 

2. అధిక మోతాదులో నత్రజని గల ఎరువులను నివారించండి

 

3. సరైన నీటి పారుదల ఉండేలా చూసుకోవాలి దీని ద్వారా ఆకస్మితా వ్యాప్తి అరికట్టవచ్చు.

 

4. ఎప్పటికపుడు పురుగుల వ్యాప్తి ని మరియు సంఖ్య ని తనిఖీ చేసుకుంటూ ఉండాలి.

 

5. ప్రభావిత మొక్క భాగాలును తీసి పడేయడం వల్ల మరింత వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చు ఎప్పటికపుడు కలుపు తీసివేసి తోట ని శుభ్రం గ ఉంచాలి

 

6. రోగనిరోధక ని పెంపొందించే దిశగా పూత దశకు ముందు ఇమిడాక్లోప్రిడ్ లేదా థియామేథోక్సమ్ లేదా మేతర్హిజియం (బయో మెటాజ్మేతర్హిజియం అనిస్పాలయి 10 మిల్లీ/లీ లేదా సన్ బయో పెస్టిసైడ్ 5 మిల్లీ/లీ) లేదా అసిఫాట్ (ఆసటాప్ 2గా /లీ లేదా స్టార్తెన్ 2గా /లీ లేదా లాన్సర్ గోల్డ్ 1.5 -2 గా/లీ) + బావిస్టీన్ 2 .5 -3గా /లీ లేదా వెట్టబల్ సల్ఫర్ 2గా /లీ. ఇవి మామిడి ప్లాంట్ హొప్పెర్ల సంఖ్య ను చంపి బూజు తెగులును కూడా నివారిస్తుంది. మరియు పరాగ సంపర్కాలు ను కాపాడుతుంది. ఇదే స్ప్రే ని పిందె దశ లో మరొకసారి పిచికారీ చేయాలి.

 

 

నిర్వహణ:

క్రింది సూచించన మందులను పదిహేను రోజుల వ్యవధి లో పిచికారీ చేయడం వల్ల  ప్లాంట్ హాప్పర్లు ను అరికట్టి మీ మామిడి పంటను నష్టాల బారిన పడకుండా  కాపాడుకోవచ్చు

 

I- మొదటి పిచికారీ :- ఇమిడాక్లోప్రిడ్ (టాటామిడ 0.5 మిల్లీ /లీ లేదా సోలొమన్ 0.75 -1 మిల్లీ /లీ) + (మేప్త్య్లడినొకప్) కరథానే  గోల్డ్ 0.7మిల్లీ /లీ +  మాంగో స్పెషల్ ప్లాంట్ బూస్టర్  2 -3  మిల్లీ /లీ

 

 

II రెండొవ పిచికారీ :- థియామిటోక్సమ్ (అక్తార 0.5 గా /లీ  లేదా అలీకా 0 .5 గా /లీ లేదా అరేవ  0 .5 గా /లీ) + హెక్సకోనజోల్ (కాన్టాప్ ప్లస్ 2 మిల్లీ /లీ  ) + క్రాంతి 2 మిల్లీ /లీ

 

 

III మూడోవ స్ప్రే :-  అసిఫాట్ (ఆసటాఫ్ 2  గా/లీ లేదా స్టార్థెన్ 2 గా/లీ లేదా లాన్సర్ గోల్డ్ 1.5 -2  గా/లీ) + మిక్లోబుతానీల్ (ఇండోఫీల్ బూన్ 1గా /లీ లేదా సైస్థానే 1గా /లీ) +  తపస్ తేజ్ యిల్డ్ బూస్టర్  2 గా/లీ

 

 

గమనిక :

1. ఈ సూచించిన మందుల్ని పూత వచ్చే దశ ముందు మరియు తర్వాత పదిహేను రోజుల వ్యవధి లో పిచికారీ చేసుకోవాలి.

 

2. పూత దశ లో మరొక తీవ్రమైన సమస్య బూజు తెగులు ను కూడా ఏ మందులు సమర్దవంతం గ అరికట్టి మొక్క ఎదుగుదలని మరియు దిగుబడిని పెంపొందిస్తాయి.

 

3. పూత ఎక్కువ వచ్చే దశ లో సింథటిక్ పీర్థ్రోయిడ్స్ (రీవా 2.5 @ 2.5 మిల్లి/లీ లేదా రీవా 5 @ 1 -1 .5  మిల్లి/లీ) లేదా డైమేథోయటు  మొక్క ట్రంక్ భాగం లో ఇంజెక్ట్ చేయడం వలన పరాగ సంపర్కాలును కాపాడవచ్చు.

**********

 

Shirisha Rudraraju

BigHaat

______________________________________________________________

అధిక సమాచారం కొరకు దయచేసి 8050797979 కి కాల్ చేయండి (లేదా) మిస్డ్ కాల్ నెంబర్ 180030002434 ఆఫీస్ సమయం 10AM నుండి 5PM  

 ______________________________________________________________

నిరాకరణ: తయారీదారు మార్గదర్శకాల ప్రకారం ఉత్పత్తి (ల) యొక్క పనితీరు వాడుకకు లోబడి ఉంటుంది. ఉపయోగం ముందు ఉత్పత్తి (ల) యొక్క పరివేష్టిత కరపత్రాన్ని జాగ్రత్తగా చదవండి.ఈ ఉత్పత్తి (ల) యొక్క పనితీరుసమాచారం వినియోగదారు యొక్క అభీష్టానుసారం.


Share this post← Older Post Newer Post →


Leave a comment